బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్‌ లపై సహకరించండి.

బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్‌ లపై సహకరించండి.
బయ్యారం స్టీల్ ప్లాంట్,  ఐటీఐఆర్‌ లపై  కేంద్ర ప్రభుత్వం తమతో సహకరించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి కోరారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయన ప్రధానికి సమర్పించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్  కోసం కేంద్రం ముందుకు వస్తే, అవసరమైన అన్ని మౌలిక వసతులను రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇనుము తరలించేందుకు అవసరమైన రైలు మార్గ నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందని కూడా తెలిపారు.  దీనిపై మోడీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని వివరించారు. 

గత ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరులో ఐటీఐఆర్ మంజూరు చేసిందని,  కానీ ప్రస్తుతం కేంద్రం నుండి ఈ విషయంలో ఎటువంటి సహకారం అందడం లేదని కేటీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అంద చేసామని, ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌తోపాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ జీ. అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.

కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ మోడీని కలిసి,  విభజన హామీల్లో భాగంగా ఉన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, హైదరాబాద్‌లో ఐటీఐఆర్ అంశాలపై చర్చించారు. దీనిపై స్పందించిన మోడీ ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారంతో సంబంధిత శాఖా మంత్రిని పంపాలని కేసీఆర్‌కి సూచించటంతో,  బుధవారం కేటీఆర్ మోడీని కలిసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post