విజయవాడను అమరావతి, గన్నవరం విమానాశ్రయాలతో కలపడానికి ఉద్దేశించిన మెట్రో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (DPR), మరో మూడు నెలల్లో సిద్ధం కానుందని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ తెలియచేసారు. ఈ విషయమై ఆయన సచివాలయంలో మెట్రో ఎండీ రామృష్ణారెడ్డి, జర్మన్ ఫైనాన్స్ ఏజెన్సీ కేఎఫ్‌డబ్ల్యు, సిస్టా కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై మండి పడ్డారు. 26 కిలోమీటర్ల విజయవాడ మెట్రో కోసం డిపిఆర్ సిద్ధం చేసి పంపిస్తే, రెండేళ్ల పాటు వారు కనీసం స్పందించలేదన్నారు. ఇప్పుడు కేంద్రం కొత్త మెట్రో విధానం తీసుకు రావటంతో కొత్త విధానం ప్రకారం డిపిఆర్ తయారు చేసి పంపిస్తున్నామన్నారు. ఇప్పుడు మొత్తం 65 కిలోమీటర్ల మెట్రో కోసం డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గతం లో నిర్మిచదలచిన లైన్ల ను అమరావతి నుండి గన్నవరం వరకు పొడగించామని, జక్కంపూడి వరకు మరో లైన్ వేస్తున్నామని వివరించారు.
Post a Comment