ఇక్కడ కూడా రెండు కళ్ళ సిద్ధాంతమే!

ఇక్కడ కూడా రెండు కళ్ళ సిద్ధాంతమే!
మీడియాను ఎంత మేనేజ్ చేసినప్పటికీ, సోషల్ మీడియాలో ఎంపీలు మాట్లాడిన వీడియోలు వైరల్ కావటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సి వచ్చింది. 

ఒక వైపు ఎంపీలు ఇష్టం వచ్చినట్లు అలా ఎలా మాట్లాడతారని, నోరు అదుపులో ఉంచుకోవాలని, దీక్షలను అపహాస్యం చేసి ఇలా పార్టీని ఇబ్బంది పెడతారా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుగు దేశానికి మద్దతు ఇచ్చే పత్రికలలోనే లీకులు వచ్చాయి. 

మరొక వైపు, ఎంపీలు అలా మాట్లాడలేదనీ, అవి కట్ పేస్ట్ వీడియోలనీ, విభజన హామీల సాధనకు తెలుగుదేశం చేస్తున్న పోరాటానికి భయపడి తమ మీద బురదజల్లేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడటమే కాకుండా విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

0/Post a Comment/Comments

Previous Post Next Post