మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు రేపు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి లో, 2.74 టీఎంసీల నీటిమట్టంతో ఉంది. ఈ నీటిలో కొంత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు వచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ లో ప్రస్తుతం 10. 171 టీఎంసీల నీరు ఉంది.
2013 లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వర్షాకాలం నాలుగు నెలల పాటు ఈ ప్రాజెక్ట్ గేట్లు తెరిచే ఉంచుతారు. ప్రతి సంవత్సరం జులై 1 నుండి అక్టోబర్ 28 వరకు గోదావరి ప్రవాహాన్ని ఈ ప్రాజెక్ట్ అడ్డుకోదు. తిరిగి అక్టోబర్ 28న ప్రాజెక్ట్ గేట్లు మూసేస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేయటం ప్రారంభిస్తే, అక్కడి నుండి నీటిని శ్రీరామ్ సాగర్ లోకి పంప్ చేస్తారు. అప్పుడు బాబ్లీ నుండి వచ్చే నీటికి ఈ స్థాయి ప్రాధాన్యం ఉండదని భావిస్తున్నారు.
Post a Comment