తెలుగు రాష్ట్రాల్లో మెరుగుపడాల్సిన నీటి నిర్వహణ

నీటి వనరుల నిర్వహణ, యాజమాన్య పద్ధతులకు కు సంబంధించి వివిధ అంశాల్లో 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు నీతి ఆయోగ్ పాయింట్లు, ర్యాంకులను కేటాయించింది.  దీనిలో 17 హిమాలయేతర రాష్ట్రాలు, 7 హిమాలయ-ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. హిమాలయేతర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌కు మూడవ ర్యాంకు , తెలంగాణకు ఎనిమిదవ ర్యాంకు లభించాయి. గత సంవత్సరం తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోగా, తెలంగాణ మెరుగు పడి 11వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరుకుంది.

వివిధ రాష్ట్రాలకు నీతి ఆయోగ్ కేటాయించిన పాయింట్లు:


ఆంధ్రప్రదేశ్ భూగర్భ నీటి పునరుద్ధరణ, భాగస్వామ్య సాగు విధానం,  ఇంటర్నెట్లో సమాచారం పొందుపరచటం వంటి విషయాల్లో మెరుగ్గా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, మురుగునీటి శుద్ధి, పట్టణ ప్రాంతాల్లో నీటి బిల్లింగ్ వంటి విషయాల్లో వెనుకబడి ఉంది. 

తెలంగాణ ఉపరితల, భూగర్భ నీటి పునరుద్ధరణ, పట్టణ నీటి సరఫరా వంటి విషయాల్లో మెరుగ్గా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో తాగు మరియు సాగు నీటి విషయంలో వెనుకబడి ఉంది.

ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో తాగు, సాగు నీటి నిర్వహణ చాలా అధ్వాన్న స్థితి లో ఉంది. ఇప్పటికీ  60 కోట్ల మందికి అంటే  75 శాతం గృహాలకు సరైన తాగునీటి సరఫరా వ్యవస్థ లేదు. గ్రామీణ భారతం లో అయితే ఇది దాదాపు 84 శాతం.  70% మంది ఇప్పటికీ కలుషిత తాగునీటిని వినియోగిస్తున్నారు. ఇటువంటి నీటిని తాగటం వల్ల ప్రతి సంవత్సరం  మన దేశంలో 2 లక్షల మంది చనిపోతున్నారు మరెంతో మంది రోగాలపాలవుతున్నారు. తాగు నీటి నాణ్యత విషయంలో  ప్రపంచంలోన 122 దేశాలకు గాను మన దేశం ప్రస్తుతం 120వ స్థానంలో ఉంది. 

ఇక వ్యవసాయం విషయానికి వస్తే దేశం లో సాగు నీటి వసతి చాలా తక్కువ. దాదాపు 53 శాతం వ్యవసాయం వర్షాధారమే.  వర్షపాతం లోని హెచ్చు తగ్గులవల్ల  సాగు నీటి వసతి లేని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  వీటికి తోడు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, నీటి నిర్వహణలో లోపాలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. 

నీతి ఆయోగ్  రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి కూడా దేశ పరిస్థితి పెద్దగా మెరుగు పడదు. అప్పటికీ జనాభాలో 40 శాతం మందికి తాగునీరు అందుబాటులో ఉండదు.  మహానగరాల్లో భూగర్భ జలాలు మరింత తగ్గిపోయి నీటి సంక్షోభం తలెత్తనుంది. తగినన్ని చర్యలు తీసుకోకపోతే నీటి కొరత దేశ జీడీపీపై పెను ప్రభావం చూపనుంది. 

నీతి ఆయోగ్  పూర్తి నివేదిక ను ఇక్కడ చూడవచ్చు.
http://www.niti.gov.in/writereaddata/files/document_publication/2018-05-18-Water-index-Report_vS6B.pdf

0/Post a Comment/Comments

Previous Post Next Post