సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మిథున సంక్రాంతి గా పరిగణిస్తారు. ఈ రోజును గతించిపోయిన వారి కర్మలు, దాన పుణ్య కార్యాలకు అనువైనది గా భావిస్తారు. ఒడిషాలో ఈ రోజును రాజా పర్వ (పర్భ ) పేరుతొ ఉత్సవంగా జరుపుకుంటారు.
ఈ రోజే మిథున సంక్రాంతి పర్వదినం అంటే సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. 12 రాశులలోకి సూర్య ప్రవేశాన్ని 12 సంక్రాంతి పండుగలుగా జరుపుకుంటారు. సౌరమానాన్ని పాటించే బెంగాల్, తమిళనాడు మరియు కేరళలలో సంక్రాంతితో కొత్త నెల ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి ఇంగ్లీష్ క్యాలెండరు ప్రకారం దాదాపు ఒకే తేదీలో వస్తుంది.
Post a Comment