ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ్టి నుండి తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం కానున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో చరిత్రను భద్రపరిచేందుకు ఏర్పడిన సంస్థల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఒకటి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే దీనిని ఏర్పాటు చేసి, రెండు మహాసభలు నిర్వహించారు. దీనిలో దాదాపు 200 మంది పరిశోధకులు తమ పరిశోధనాపత్రాలు సమర్పించనుండగా, మొత్తం 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
ఇవాళ జరుగనున్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి మహాసభ, మొత్తంగా మూడోది. ఓయూ లో చరిత్ర విభాగం స్థాపించి వందేండ్లు గడుస్తున్న సందర్భంగా ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలను ఓయూలోని PGRRCDE ఆడిటోరియంలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభిస్తున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ డాక్టర్ సీ రంగరాజన్ ముఖ్య అథితి గా హాజరుకానుండగా, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ నరేంద్రలూథర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ డీ రాజారెడ్డి, స్కేట్ ఆర్హెక్యూస్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ రీసర్చ్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏ నయీమ్, స్కేట్ ఆర్హెక్యూస్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ కమిషనర్ డాక్టర్ హెచ్ రాజేంద్రప్రసాద్ హాజరవనున్నారు.
Post a Comment