ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు ఆదివారం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాల గురించి మాట్లాడారు. రాష్ట్రం  అభివృద్ధి పథంలో సాగుతుందనీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము విజయం సాధించటం తథ్యమని ధీమా వ్యక్తం చేసారు. 

బహుశా ముందస్తు ఎన్నికలు జరుగవచ్చు. నాకు ఖచ్చితమైన సమాచారం ఏమీ లేదు. కాంగ్రెస్ వారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి అడ్డంకులను సృష్టిస్తున్నారు.  ఇలాంటివి చేసే బదులు మమ్మల్ని ఎన్నికలలో ఎదుర్కొంటే బావుంటుంది అని కాంగ్రెస్ మంత్రి దానం నాగేందర్ పార్టీలో చేరినప్పుడు టిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.

నీటిపారుదల ప్రాజెక్టులు మరియు అభివృద్ధిని అడ్డుకోవటానికి కాంగ్రెస్ వారు కోర్టులలో 196 కేసులను దాఖలు చేసారని ఆయన ఆరోపించారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందుతుండగా వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లలో 100 కు పైగా సీట్లలో టిఆర్ఎస్ విజయం సాధించగలదని కేసీఆర్ అన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post