తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు 17.2%

తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు 17.2%
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, గత నాలుగేళ్లుగా సగటున సాలుకు 17.2%  వృద్ధి రేటు తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో 14.2 శాతంతో హర్యానా, మూడవ స్థానంలో 13.9 శాతంతో మహారాష్ట్ర నిలిచాయి. కేవలం అయిదు రాష్ట్రాలు మాత్రమే 10 శాతానికి పైగా వృద్ధి రేటును కనపరచటం గమనార్హం . ఒడిషా 12.4%, పశ్చిమ బంగా 10.3% తో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.  

2014 నుంచి 2018 వరకు ఈ ప్రభుత్వ ఆదాయ వివరాలను కాగ్ ప్రకటించింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సంపద సృష్టి (GSDP) లో వృద్ధి, దాదాపు సాలుకు 10% మాత్రమే ఉండగా, ప్రభుత్వ ఆదాయం మాత్రం సగటున 17.2% వృద్ధి చెందింది. దీనికి కారణం ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లించటమా? ముక్కు పిండి ఎక్కువ పన్నులు  చేయటమా? అనేది పేర్కొనలేదు. 

తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, సమగ్ర ఆర్థిక విధానాలు, పన్నుల చెల్లింపులో ప్రజలు చూపిస్తున్న చిత్తశుద్ధితోనే రాష్ట్ర ఆదాయాభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి  కేసీఆర్  గారు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వెలువడిన ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ కాలం లో నోట్ల రద్దు, జిఎస్టి లాంటి వాటిని తట్టుకుని మరీ ఆదాయ వృద్ధిని సాధించామని అన్నారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post