పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణాన్ని పరిశీలించిన కేసీఆర్

పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణాన్ని పరిశీలించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నిర్మాణంలో ఉన్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణాల్ని పరిశీలించారు. బంజారాహిల్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ జంట భవనాలను ఏడెకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. మొత్తం అయిదు లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానుంది.  జరుగుతున్న పనుల పట్ల ముఖ్యమంత్రి గారు తన సంతృప్తిని వ్యక్తం చేసారు. వీలైనంత త్వరలోనే అందుబాటులోకి తేవాలని అధికారులతో అన్నారు. 

పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను, ప్రకృతి విపత్తులను, పెద్ద పెద్ద ఈవెంట్లను (జాతరలు, ఊరేగింపులను) ,ఇక్కడ నుండే పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post