వారసుల కోసం తండ్రుల ఆరాటం

వారసుల కోసం ఆరాటం
రాజ్య సభ సభ్యుడు డి శ్రీనివాస్ కు, ఇతర  టీఆరెస్ నేతలకు మధ్య విభేదాలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ నిజామాబాద్ జిల్లాలో నడుస్తున్న రాజకీయాలన్నీ వారసుల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమేనన్నారు. కవిత కోసం కేసీఆర్ ఆరాట పడితే, కొడుకుల కోసం డీఎస్ ఆరాట పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు అవమానం జరిగిందని మాట్లాడిన దానం నాగేందర్, ఇప్పుడు డీఎస్‌కు జరిగిన అవమానంపై స్పందించాలని కూడా అన్నారు.

మరోవైపు కేసీఆర్ విజయవాడ పర్యటనపై కూడా రేవంత్ సెటైర్లు వేసారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు గుట్టమీద అమ్మవారు, గుట్టకింద కమ్మ వారు గుర్తుకు రావడం మామూలేనన్నారు. 

0/Post a Comment/Comments