మాజీ ప్రధాని ఇంట్లో రెండు వేల కోట్ల స్వాధీనం

మాజీ ప్రధాని ఇంట్లో రెండు వేల కోట్ల స్వాధీనం
మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ ఇంట్లో జరిగిన సోదాల్లో  నగదు, ఆభరణాలు, లగ్జరీ పర్సులు, గడియారాలు లాంటి వస్తువులు మొత్తం దాదాపు 273 మిలియన్ డాలర్ల (రెండు వేల కోట్లు) విలువగలవి స్వాధీనం చేసుకున్నట్లు మలేషియన్ పోలీసులు తెలిపారు. 

వస్తువులలో రెండు మిలియన్ల డాలర్ల విలువైన డైమండ్ నక్లెస్‌, 14 వజ్రాలు, 272 లగ్జరీ బ్యాగులు ఉన్నాయి.  దొరికిన 473 వాచీల ధరే 20 మిలియన్ డాలర్లట. దాదాపు 30 మిలియన్ డాలర్ల విలువ గల వివిధ దేశాల కరెన్సీ కూడా లభ్యమైంది. 

1ఎండీబీ కంపెనీలో చోటుచేసుకున్న అవకతవకలపై మాజీ ప్రధాని నజీబ్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి. మలేషియాలోని పోలీస్ వాణిజ్య నేరాల విభాగం అధిపతి దాతుక్ సేరి అమర్ సింగ్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ,  నజీబ్ కు గల ఆరు ఇళ్ళనుండి ఈ వస్తువులు లభించినట్లు తెలిపారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post