కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో రైల్వే శాఖలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు తదితర అంశాలపై మాట్లాడేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో విలేఖరులు విశాఖ రైల్వే జోన్ అంశంపై మంత్రిని ప్రశ్నించగా రాష్ట్ర విభజన చట్టంలో కేవలం రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందని వాక్రుచ్చారు. ఇప్పటికీ రైల్వే శాఖ ఆ విషయాన్ని పరిశీలిస్తూనే ఉందనీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ అన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇదే మాట చెప్పినట్లు గుర్తు చేశారు.
ఎప్పటిలాగే పీయూష్ గోయల్ సాచివేత ధోరణి అవలంభించటం, రైల్వే జోన్ అంశం పై రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవటమే అవుతుంది. ఒడిషా రాష్ట్రం ఒప్పుకోవటం లేదనీ, పరిశీలిస్తూనే ఉన్నామని వంటి వివిధ కారణాలు చూపిస్తూ సమయం గడిపేస్తున్నారు.
Post a Comment