కేంద్ర ఆర్ధిక మంత్రి ఇవాళ పౌరులందరికీ వారి వాటాకొచ్చే పన్నులను నిజాయితీగా చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేసారు. దాని వల్ల చమురు ఉత్పత్తుల మీద పన్నును ప్రభుత్వ ఆదాయ మార్గంగా భావించవలసిన దుస్థితి తప్పుతుందని వివరించారు. అలాగే రాబోయే సమీప కాలంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సయిజ్ డ్యూటీ తగ్గించే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
ఉద్యోగ వర్గాలు పన్నులన్నీ సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ సమాజంలోని ఇతర వర్గాల వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. గత నాలుగు సంవత్సరాలలో టాక్స్ /జిడిపి రేషియో 10 నుండి 11.5 శాతానికి పెరిగిందనీ, దీనిలో సగం అంటే 0.72 చమురేతరమేనని స్పష్టం చేసారు.
ఆర్ధిక మంత్రి జైట్లీ గారు ఫేస్ బుక్ లో షేర్ చేసిన డాక్యుమెంట్ నుండి ఈ వార్త తీసుకోవటం జరిగింది.
ఆర్ధిక మంత్రి జైట్లీ గారు ఫేస్ బుక్ లో షేర్ చేసిన డాక్యుమెంట్ నుండి ఈ వార్త తీసుకోవటం జరిగింది.
Post a Comment