ఢిల్లీ సంక్షోభంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జాగ్రత్తగా పొందుపర్చబడినట్లున్న ఈ ట్వీట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తుంది.
ఈ ట్వీట్లో రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి లెఫ్టనెంట్ గవర్నర్ ఇంట్లో ధర్నా చేస్తున్నాడనీ, బీజేపీ పార్టీ కేజ్రీవాల్ ఇంట్లో ధర్నా చేస్తోందనీ, అధికారులు ప్రెస్ మీట్లు పెడుతున్నారనీ, ప్రధానమంత్రి ఈ అరాచకానికి స్పందించకుండా కళ్ళు మూసుకున్నాడనీ, పరిస్థితి అధ్వాన్నంగా తయారయిందనీపేర్కొన్నాడు. ఈ ధర్నా ఆటలో ప్రజలే బాధితులుగా మారారని కూడా పేర్కొన్నాడు.
Delhi CM, sitting in Dharna at LG office.BJP sitting in Dharna at CM residence.Delhi bureaucrats addressing press conferences.PM turns a blind eye to the anarchy; rather nudges chaos & disorder.People of Delhi are the victims, as this drama plays out.
— Rahul Gandhi (@RahulGandhi) 18 June 2018
Post a Comment