జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేసారు. విశాఖ పట్నం ల్యాండ్ స్కాములో సీఎం సహా పలువురు నేతలకు ప్రమేయం ఉందని, అందుకే సిట్ ఇచ్చిన నివేదికను బయట పెట్టడం లేదని అన్నారు. విషయం తనకు తెలుసని, దమ్ముంటే నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేసారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉద్యోగాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి, తన కుమారుడికి మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నాడని, టిడిపి నేతలను చొక్కా పట్టుకొని నిలదీయాలని లేకపోతే వారు ప్రజలను బానిసలుగా చేస్తారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా లో షేర్ అవుతున్న ఆ పార్టీ ఎంపీల వీడియో గురించి మాట్లాడుతూ, వారు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమౌతుందని కూడా అన్నారు.
ప్రతిపక్ష నేత జగన్ ను కూడా ఆయన వదల లేదు. మరొక నేత తాను అధికారం లోకి వస్తే అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడని, కానీ ఏ పదవి లేకుండానే ప్రజల సమస్యలపై పోరాటం చేసేవారే నిజమైన నాయకులని అన్నాడు. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని కూడా ముక్తాయించాడు.
Post a Comment