శుక్రవారం ఉదయం, అనంతనాగ్ లోని శ్రీగుప్వార ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు, ఒక పోలీస్, ఒక సాధారణ పౌరుడు మరణించారు. ఇద్దరు సైనికులతో సహా మొత్తం 20 మంది గాయపడ్డారు.
సైనికులు ఎదురుపడటంతో ఉగ్రవాదులు శ్రీగుప్వార లో ఖీరం ప్రాంతంలోని ఒక ఇంటిలోకి చొరబడ్డారు. ఎదురు కాల్పులలో ఇంటి యజమాని మరియు అతని భార్య గాయపడ్డారు. ఆసుపత్రిలో యజమాని మరణించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇది గవర్నర్ పాలన విధించిన తర్వాత జరిగిన తోలి ఎన్ కౌంటర్ కావడం విశేషం.
Post a Comment