జార్ఖండ్‌లో దారుణం - ఐదుగురు మహిళలపై సామూహిక అత్యాచారం

జార్ఖండ్లోని ఖుంతి జిల్లాలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు వెళ్లిన ఓ ఎన్‌జీఓ బృందానికి చెందిన ఐదుగురు మహిళలపై దుండగులు సామూహిక అత్యాచారం జరిపారు. 

జూన్ 19 న చోచాంగ్  గ్రామంలోని R.C. మిషన్ స్కూల్  కి వెళ్లిన 11 మంది సభ్యులతో కూడిన ఎన్‌జీఓ బృందం పై తుపాకులు కలిగి ఉన్న దుండగులు దాడి చేసి బృందంలోని పురుషులను చితకబాది ఐదుగురు మహిళలను సమీప అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి తుపాకీ గురిపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులు ఈ లైంగిక దాడిని తమ సెల్ ఫోన్  లో చిత్రీకరించి, పోలీసులకు చెప్తే సోషల్ మీడియా వైరల్ చేస్తామని బెదిరించారు. వీరు మూడు గంటల తర్వాత మహిళలను విడుదల చేశారు.  

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామనీ,  ఇప్పటివరకు ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను  అదుపులోకి తీసుకున్నామని డీఐజీ అమోల్‌ వీ హోంకర్‌ తెలిపారు. నిందితులందరినీ పతల్గడి తెగ కు చెందిన వారిగా గుర్తించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post