కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా

మాజీ మంత్రి  దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామాకు గల కారణాలను విశ్లేషిస్తూ ఏఐసీసీకి ఆయన లేఖ రాశారు. ఈ కారణాలను రేపు మీడియా ముందు వెల్లడిస్తానని నాగేందర్ స్పష్టం చేశారు. గత కొంత కాలంగా ఆయన పార్టీ నాయకత్వం పై అసంతృప్తి తో ఉన్నారు. ఆ మధ్య కాలంలో టీఆరెస్ లో చేరతారని వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఆయన ఖండించారు. ఈయన పార్టీని వీడితే హైదరాబాద్ లో పార్టీకి నష్టమని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనను బుజ్జగించే అవకాశాలున్నాయి.  

నాగేందర్ గారు 1994, 1999, 2004 లలో అసిఫ్ నగర్ నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. 2009 లో ఖైరతాబాద్ నుండి గెలిచారు. కానీ 2004 లో టిడిపి నుండి ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవటంతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కానీ ఉప ఎన్నికలలో ఓడిపోయారు. 2009 లో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజ శేఖర్ రెడ్డి, రోశయ్యల హయాంలో ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసారు. 

0/Post a Comment/Comments