ప్రముఖ సంగీత దర్శకుడు A.R. రెహమాన్ ను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించామని సిక్కిం ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ముఖ్య కార్యదర్శి ఎ.కె. శ్రీవాత్సవ పేరిట జారీ అయిన ఈ నోటిఫికేషన్ ప్రకారం రెహమాన్ సిక్కిం ప్రభుత్వం సాధించిన విజయాలను జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ప్రచారం చేస్తారు.
ప్రకృతిసిద్ధమైన అందాలను కలిగి ఉండే సిక్కిం రాష్ట్రం, గత రెండు దశాబ్దాలలో ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ పర్యాటక గమ్యంగా మారింది. దేశంలో మొట్టమొదటి 100% సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా సిక్కిం గుర్తింపు కలిగిఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలోనే A.R. రెహమాన్ ను పర్యాటక మరియు వ్యాపార రంగాలకు తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే బాధ్యత కూడా వీటికి జత కలిసింది.
Post a Comment