కెనడాలో గంజాయి వాడటం ఇక అధికారికమే

కెనడాలో గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును మంగళవారం పార్లమెంటు ఎగువ సభ 52-29 ఓట్లతో ఆమోదించింది. దీనితో కెనడా, జి-7 కూటమిలో  గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి దేశంగా మారింది. 

ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన 2015 ఎన్నికల ప్రచారంలో భాగంగా మారిజువానాను చట్టబద్ధం చేసే హామీని ఇచ్చారు. ఇప్పటివరకు నిషేధం అమల్లో ఉన్నా కెనడా లో ఇది విస్తృతంగా లభ్యమయ్యేది. ఈ చట్టం వల్ల మైనర్లకు గంజాయి అందుబాటులో లేకుండా పోతుంది మరియు ఇకపై  నేరస్తులు దీనిని అమ్మి లాభాలు ఆర్జించలేరు. అని ట్రూడో ట్విట్టర్లో  పేర్కొన్నారు.

కెనడా మారిజువానాను చట్టబద్దం చేసిన తొలి పెద్ద ఆర్ధిక వ్యవస్థ కావటంతో మిగిలిన దేశాలు ఈ చట్టం అమలును జాగ్రత్తగా గమనించనున్నాయి. ఇది గతంలోనే చట్టబద్దం కావలసి ఉన్నప్పటికీ  కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. 

గంజాయి ఉత్పత్తిని ఫెడరల్ ప్రభుత్వం నియంత్రించనుంది.  రాష్ట్రాలు మరియు నగరపాలికలకు అక్కడ ప్రైవేట్ దుకాణాల ద్వారా అమ్మాలా లేదా ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మాలా అనేది నిర్ణయించే అధికారం ఉంటుంది. 

సెనెట్లో బిల్లు ప్రతిపాదించిన టోనీ డీన్,  "నేను గొప్ప అనుభూతి చెందుతున్నాను, ఇది 90 సంవత్సరాల నిషేధానికి ముగింపు. గొప్ప సామాజిక పరివర్తన విధానం, ప్రభుత్వంలోని ఒక ధైర్యమైన కదలిక." అని వ్యాఖ్యానించారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post