పోలీసులను ఆశ్రయించిన శేఖర్ కమ్ముల

పోలీసులను ఆశ్రయించిన శేఖర్ కమ్ముల
ఎవరో తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఇంపర్సనేషన్ కేసును ఫైల్ చేసారు. తన పేరు తో కొందరు వ్యక్తులు క్వికర్, ఓఎల్‌ఎక్స్‌లో యాడ్స్ ఇచ్చి, సినిమాల్లో వేషాల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని,  అక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. 

ఆ యాడ్స్ తో గానీ, అది ఇచ్చిన వ్యక్తులతో గానీ తనకు ఎటువంటి సంబంధం లేదనీ, ఎవరూ  మోసపోవద్దని ఆయన అన్నారు. తను గానీ, తనతో సంబంధం ఉన్న వ్యక్తులు గానీ డబ్బులు డిమాండ్ చేయరని ఈ సందర్భంగా అయన తెలియజేసారు. 

0/Post a Comment/Comments