తక్షణమే 10 వేల కోట్లు ఎలా ఇస్తారో....

తక్షణమే 10 వేల కోట్లు ఎలా ఇస్తారో....
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, కేంద్ర ప్రభుత్వం తక్షణమే 10వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాసారు.  వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర జల వనరుల శాఖకు, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా, ఢిల్లీలో సవరించిన అంచనాలు  సమర్పించనున్నారు. అయితే ఈ అంచనాలు ఆమోదించటానికి ముందే ఈ 10వేల కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేయడం విశేషం. 

చంద్రబాబు గారు కేంద్రం తో సఖ్యతగా ఉండి నాలుగేళ్లలో పోలవరానికి ఖర్చు చేసి సాధించుకున్న నిధులు 6727.26 కోట్లు. కానీ ఇప్పుడు కనీసం అంచనాలైనా సమర్పించక ముందే (ఆమోదం సంగతి ప్రస్తుతానికి వదిలేద్దాం) 10 వేల కోట్లు ఇస్తారని ఎలా అనుకుంటున్నారో, అడగటంలో ఔచిత్యం ఏమిటో అర్థం చేసుకోవటం కష్టమే. ఇప్పటి వరకూ కేంద్రం అంచనాలు ఆమోదింపబడకుండా ఏ రాష్ట్రానికీ  నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం ప్రకృతి వైపరీత్యాల సమయంలో, అదీ కొద్ది మొత్తంలో నిధులను అంచనాలు లేకుండా విడుదల చేస్తుంది. 

ఇక పోలవరం అంచనాల విషయానికి వస్తే, కేంద్రం 2014 కు ముందు నీటిపారుదల వ్యయానికి సంబంధించిన నిధులు మాత్రమే ఇస్తానని అంటుంది. అంటే సహాయ పునరావాసాలకు, జల విద్యుత్ ప్లాంటుకు మరియు సవరింపబడితే పెరిగిన వ్యయానికి నిధులు రావటం కష్టమే. 

0/Post a Comment/Comments

Previous Post Next Post