ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బంది నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువులు తారుమారయ్యారు. నగరంలోని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. అండూరు గ్రామానికి చెందిన అర్చన, బొల్లారం గ్రామానికి చెందిన సరస్వతి ఇద్దరూ ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, ఇద్దరికీ వైద్యులు సోమవారం ఆపరేషన్ చేశారు. వార్డుబాయి సరస్వతికి ఆడశిశువును, అర్చనకు మగ శిశువును అప్పగించాడు.
మగశిశువు పుడితే ఆడ శిశువును ఇచ్చారంటూ సరస్వతి బంధువులు ఆందోళన చేయటంతో, మార్చి సరస్వతికి మగ శిశువును, అర్చనకు ఆడ శిశువును అప్పగించారు. దీనిపై అర్చన భర్త శ్రీశైలం అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఏ శిశువు అయినా ఒకటేననీ, అయినా జీవితాంతం అనుమానంతో బతకలేమని అంటూ డీఎన్‌ఏ టెస్టు కోసం పట్టుబట్టాడు. దీనితో పటాన్‌చెరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి డీఎన్‌ఏ టెస్టుకు పంపించారు. రిజల్టు వచ్చే వరకూ తల్లులిద్దర్నీ ఆస్పత్రిలోనే ఉంచేందుకు ఏర్పాట్లు చేసారు.
Post a Comment