సౌదీ అరేబియాలో మహిళలకు ఆదివారం అర్ధరాత్రి నుండి రోడ్లపై డ్రైవింగ్ చేసే స్వాతంత్య్రం వచ్చింది. ప్రపంచంలో మహిళల డ్రైవింగ్ పై నిషేధం ఎత్తివేసిన చిట్టచివరి దేశం సౌదీ అరేబియా. సంప్రదాయవాద ముస్లిం రాజ్యంలో మహిళల ఎదుగుదలకు, వారి హక్కులకు ఇది సంకేతంగా నిలిచింది. పెద్ద సంఖ్యలో మహిళలు అర్ధరాత్రి డ్రైవింగ్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తెస్తున్న విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఇది సాధ్యమైంది. అభివృద్ధి పథంలో సాగాలన్న యువరాజు ఆలోచనలకు అనుగుణంగా సౌదీ రాజు సల్మాన్ గత సెప్టెంబరు లోనే మహిళల డ్రైవింగ్ కు ఆమోదముద్ర వేసారు. ప్రస్తుతం చమురు ఎగుమతిపై ఆధారపడి ఉన్న ఆర్ధిక వ్యవస్థను వికేంద్రీకరించటమే ఆయన ఉద్దేశ్యం. సౌదీ మహిళలు ఇంకా విదేశీయానం, పెళ్లి విషయంలో వారి హక్కులను సాధించుకోవలసి ఉందని అక్కడి మహిళా ఉద్యమకారులు చెబుతున్నారు.
సౌదీ అరేబియా, మహిళల డ్రైవింగ్ కోసం సన్నాహకంగా మహిళా వెహికల్, ఇన్సూరెన్స్ ఇన్స్పెక్టర్లను నియమించింది. ఆసిల్ ఆల్-హమాద్ అనే సౌదీ అరేబియా మహిళ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ కు ముందు, ఫార్ములా 1 కార్ డ్రైవ్ చేయనుంది.
Post a Comment