విజయ్ దేవరకొండ ఇంటికి కేటిఆర్

విజయ్ దేవరకొండ ఇంటికి కేటిఆర్
అర్జున్ రెడ్డి సినిమా తో దేశవ్యాప్తంగా గుర్తిపు పొందిన నటుడు విజయ్ దేవరకొండ ఇంటికి రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటిఆర్ వెళ్లారు. విజయ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

మీకు ఇష్టమైన నాయకుడు లంచ్‌కు ఇంటికి వచ్చినప్పుడు.. ఒక్క సెకను.. అసలు ఏం జరుగుతోంది బాసు? నిజానికి ఏమైనా జరగొచ్చు. ఏది నచ్చితే అదే చేస్తుంటాం’ అని విజయ్‌ తన కుటుంబంతో కేటీఆర్‌ ఉన్న ఫొటోను అభిమానులతో విజయ్ పంచుకున్నారు.

కేటీఆర్‌ గారికి  నా ఫిల్మ్‌ఫేర్‌ చూపించా, వేలం గురించి మాట్లాడాం. చేనేత కార్మికులు, వస్త్రాలు, నీటి నిర్వహణ, ఎందుకు హైదరాబాద్‌ రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి, చరిత్ర, తన తండ్రి-కుమారుడి గురించి ఆయన మాతో ముచ్చటించారు. "విజయ్‌ ప్లాస్టిక్‌ వాడటం ఆపు" అని అన్నారు. కేటీఆర్‌కు సిటీని చూపిస్తున్న మరొక ఫొటోను షేర్‌ చేసారు.

కేటిఆర్ గారు వరుసగా సినిమా నటులతో కలవటం, వారి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా  సినీ రంగాన్ని, అభిమానులను తనకు  అనుకూలంగా మలుచుకుంటున్నారనే భావన కలుగుతుంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post