12 లక్షలను తినేసిన ఎలుకలు

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కు చెందిన ఓ ఏటీఎంలో ఎలుకలు జొరబడి దాదాపు 12.38 లక్షల రూపాయల విలువైన 2000, 500 రూపాయల  నోట్లను ను తినేసాయి.  ఈ సంఘటన అస్సాం లోని టిన్సుకియా జిల్లా లో జరిగింది. వీటికి సంబంధిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి.  

FIS గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు, గత నెల మే 19న 29.48 లక్షల రూపాయల విలువైన 2000, 500 రూపాయల నోట్లను ఏటీఎంలో పెట్టారు. ఆ తర్వాత రోజు నుండి అది పని చేయటం మానేసింది. జూన్‌ 11న సంస్థ  ప్రతినిధులు ఏటీఎంను తిరిగి ఓపెన్‌ చేయగా నోట్లను  ఎలుకలు కొరికేసి చిందరవందరగా పడిఉండటాన్ని గుర్తించారు. వాటిలోంచి ₹17.10 లక్షల రూపాయలను చిరిగిపోకుండా ఉన్నవిగా గుర్తించారు. మెషీన్‌లో దూరిన ఎలుకే ఈ పనిచేసిందని భావిస్తున్నారు.

ఈ సంఘటన పై  టిన్సుకియా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎస్పీ ముగ్దజ్యోతి మహంత ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post