భారతీయ జనతా పార్టీ, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. ఈ మేరకు సంకీర్ణం లో నుండి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. బిజెపికి ఈ రాష్ట్రంలో 25 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఈ విషయమై బిజెపి ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ ఢిల్లీలో మాట్లాడుతూ పరిస్థితులు ప్రభుత్వంలో కొనసాగటానికి ప్రతికూలంగా మారాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు ఏర్పడటానికి, అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపించారు. నిర్ణయం తీసుకునే ముందే రాష్ట్ర ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ చర్చించామని కూడా తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలుండగా, పిడిపి కి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ మద్దతు ఉపసంహరణతో మెహబూబా ముఫ్తి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.
Post a Comment