కాల్పుల విరమణను పొడిగించడం లేదు

కాల్పుల విరమణను పొడిగించడం  లేదు
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రకటించిన కాల్పుల విరమణను పొడిగించే అవకాశం లేదని కేంద్ర హోమ్ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. అలాగే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్ని పునరుద్దరించవలసిందిగా ఆదేశాలు జారీ చేసారు.

కాల్పుల విరమణను పాటి ఒక్కరూ పాటిస్తారని భావించాము. భద్రతా దళాలు దీనిని నిబద్దతతో అమలు జరిపాయి.  కానీ ఉగ్రవాదులు దాడులు కొనసాగించి సామాన్య ప్రజలకు, భద్రతా దళాలకు నష్టం కలిగించారు అని హోమ్ మంత్రి వ్యాఖ్యానించారు.

కేంద్రం కాల్పుల విరమణను మే 17 నుండి కొనసాగిస్తుంది. ఈ కాలంలో ఉగ్రవాదులు సీనియర్ జర్నలిస్ట్ సుజాత్ బుఖారిని,  జవాన్ ఔరంగజెబ్  ని హతమార్చారు.  


0/Post a Comment/Comments