నేడే ఫాదర్స్‌ డే

నేడు తండ్రుల దినోత్సవం (ఫాదర్స్‌డే). ప్రపంచంలో ప్రతి బిడ్డ తన కన్నతండ్రి ప్రేమను గుర్తు చేసుకొనే రోజు. అసలు  నాన్న అంటేనే కష్టమొచ్చినా సుఖమొచ్చినా వెన్నంటి నిలిచే అండ. ఈ ఫాదర్స్‌ డే జరుపుకోవటం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 

వాషింగ్టన్‌కు చెందిన సొనోరా అనే మహిళ చిన్నతనం లోనే తల్లి మరణించటం తో తండ్రి వద్దే పెరిగింది. అయితే తండ్రి తనపై చూపిన ప్రేమ, ఆప్యాయతలతో సంతోషించిన ఆమె తల్లులకోసం ఒకరోజు కేటాయించినప్పుడు తండ్రుల కోసం కూడా ఒకరోజు ఎందుకు కేటాయించకూదని పోరాటం చేసింది. ఆమే 1910 జూన్‌ 19వ తేదీన ఫాదర్స్‌డేకు శ్రీకారం చుట్టింది. అప్పటినుండి జూన్ మూడవ ఆదివారాన్ని ఫాదర్స్ డే గా పరిగణిస్తున్నారు. 1916 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్  ఫాదర్స్‌ డేకి అధికారిక హోదా కల్పించారు. 1926వ సంవత్సరంలో నేషనల్‌ ఫాదర్స్‌డే కమిటీ ఏర్పాటు అయ్యింది.  అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్ 1972 లో ఫాదర్స్‌డే ను జాతీయ పండుగగా ప్రకటించాడు. తర్వాత అది ప్రపంచ వ్యాప్తమైంది. 

హ్యాపీ ఫాదర్స్‌డే…

0/Post a Comment/Comments

Previous Post Next Post