తెలంగాణపై దగ్గుబాటి పుస్తకం

ఎన్టీ రామారావు అల్లుడు, మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు గారు బుధవారం విజయవాడలో మీడియా తో మాట్లాడుతూ తాను తెలంగాణ పోరాటంపై పుస్తకం రాసానని, రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఏవిధంగా ఉద్యమించారో అందులో వివరించానని చెప్పారు. 

రాజకీయాల నుంచి తప్పుకొన్నాక  తాను ప్రశాంత జీవనం గడుపుతున్నానని, ఇప్పటి రాజకీయాలు తనకు సరిపడవని అన్నారు. 1983 లో ఐదు వేల రూపాయల ఖర్చుతో టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారున్నారని, నేడు డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఎమ్మెల్యే టికెట్ లభిస్తున్నదని అన్నారు. ఇన్ని కోట్ల ఖర్చుతో గెలిచి ప్రజాసేవ ఏం చేస్తారో అర్థం కావటం లేదని కూడా అన్నారు.  తాను భవిష్యత్తు లో కూడా ఏ పార్టీలోనూ చేరే అవకాశం లేదని వివరించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post