యువ నటుడు జై మంగళవారం ట్రాఫిక్ పోలీసుల చేతికి దొరికి పోయాడు. నుంగంబాక్కమ్ మెయిన్ రోడ్ లో లౌడ్ సైరన్ మోగించుకుంటూ వెళ్లడంతో ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. దాంతో పోలీసులు జై కారును అడ్డుకుని, ధ్వని కాలుష్య అవగాహనకు సంబంధించిన వీడియోను చూపించారు. ఆయనతో క్షమాపణ పత్రం రాయించుకుని వదిలి పెట్టారు.
2017 సెప్టెంబర్ 21న కూడా అడయారు బ్రిడ్జ్ సమీపంలో గొడను ఢీ కొట్టి మరీ డ్రంకెన్ డ్రైవ్ కేసులో అరెస్టయ్యాడు. అప్పుడు జరిమానా విధించి, ఆరు నెలల పాటు లైసెన్సు రద్దు చేసారు. 2014 ఏప్రిల్ 13న అయితే కేకేనగర్ సమీపంలోని కాశి థియేటర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఏకంగా ట్రాఫిక్ పోలీస్ వెహికల్ని ఢీకొట్టాడు.
Post a Comment