అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కురుక్షేత్రం’. దీనిలో ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్, వైభవ్, సుహాసిని, శ్రుతి హరిహరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది అర్జున్ కు 150వ చిత్రం కావటం విశేషం.
చూసే వాళ్ల దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థం మారుతుంది. ఏం అర్థమైందో చూసి చెప్పండి - అనే మాటలతో ట్రైలర్ మొదలవుతుంది. దీనికి ఆయన ‘ఇదిగో నీలం కనిపిస్తోందే అది కొలను.. ఇక్కడ ఓ హత్య జరిగింది. ఇదిగో ఇక్కడ తెట్లు తెట్లుగా ఎర్రగా కనిపిస్తోందే అదే రక్తం. ఈ కత్తి పట్టుకెళ్తున్నాడే.. చంపేసి వెళ్తున్నాడు’ అని వర్ణించారు.
Post a Comment