రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు తుది అంచనాను కొంత మేర తగ్గించింది. దీనిని 53,735.2 కోట్ల రూపాయలకు పరిమితం చేస్తూ తుది అంచనాలు రూపొందించింది.
ఈ మొత్తంలో భూ సేకరణ, పునరావాస కార్యక్రమాలకే భారీ మొత్తం ఖర్చవనుంది. దీనికోసం 33,225.74 కోట్ల రూపాయలు కేటాయించారు. దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని రాష్ట్ర జలవనరుల శాఖా బృందం జూలై మొదటి వారంలో ఢిల్లీ వెల్లనుంది. ఈ బృందం తుది అంచనాను కేంద్ర జలవనరుల కమిషన్ కు సమర్పించి, మంత్రి నితిన్ గడ్కరీని కలసి ఆమోదించమని కోరనుంది.
2013-14 వ సంవత్సరం లో జల విద్యుత్ కేంద్రంతో కలిపి ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని 58,319.06 కోట్ల రూపాయలుగా రాష్ట్ర జలవనరుల శాఖ అంచనా వేసింది. ఇప్పుడు ఉక్కు ధరలు తగ్గటంతో వాటిలోంచి 378.20 కోట్లు తగ్గించింది. జల విద్యుత్ కేంద్రం కోసం ఖర్చయ్యే 4205.66 కోట్లను కూడా తగ్గించటంతో, అంచనా 53,735.20 కోట్లకు చేరింది. రాష్ట్ర మంత్రి గారి కంటే ముందే, ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.వెంకటేశ్వరరావు, ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులతో సాంకేతిక అంశాలపై సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు.
Post a Comment