రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం

ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, 108కు సమాచారం అందించారు. చనిపోయిన వారు కోడుమూరు మండలం కల్లపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరు ఆటోలో మహానందికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post