29 సంవత్సరాలకు బయటపడ్డ అవశేషాలు

29 సంవత్సరాలకు బయటపడ్డ అవశేషాలు
1989వ సంవత్సరం  జూలై 23 వ తేదీన కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల వాగుకు భారీ వరదలు రావటంతో దానిలో ఒక లారీ గల్లంతైంది. మూడు రోజుల తర్వాత లారీ డ్రైవర్ అబ్దుల్‌ఘనీ(25) మృతదేహం వాగులో లభ్యమవటంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని వాగులోనే గల్లంతయినట్లు అనుమానించి గాలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ లారీలో శంకరపట్నంకు చెందిన లారీ యజమానులు ఎండీ దౌలత్‌ఖాన్, ఎండీ ముక్తుంఖాన్, కరీంనగర్‌లోని కార్ఖానగడ్డకు చెందిన కటికె శంకర్, వెంకటస్వామిలు గల్లంతయ్యారు. 

ఈ సంఘటన జరిగి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ఈ నెల ఏడవ తేదీన ఇసుక కోసం ఇరుకుల్ల పాత బ్రిడ్జి వద్ద తవ్వుతుండగా కొన్ని లారీ పరికరాలు బయటపడ్డాయి. గడిచిన వారం రోజులుగా తవ్వకాలలో  ఒకచోట లారీ భాగాలు, మరో మూడు చోట్ల ఎముకలు బయటపడ్డాయి. శనివారం కూడా మరికొన్ని లారీ విడి భాగాలతోపాటు దుస్తులు, ఒక కపాలం  కూడా లభ్యమయ్యింది. 

0/Post a Comment/Comments