పవన్‌ గాలి మాటలు వినే రకం - ఉప ముఖ్యమంత్రి

పవన్ అంటే గాలి... గాలి వార్తలు నమ్మి వాటిని చెప్పడం తప్ప ఆయనకు ఆలోచించే శక్తి లేదని ఆయన ఎద్దేవా  చేసారు. రీల్ లైఫ్ వేరు.. రియల్ లైఫ్ వేరు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం ఆయనకు అలవాటుగా మారిందని ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. 

ప్రజాక్షేత్రంలో ఉండే వారు బాధ్యతగా మెలగాలని ఆయన సూచించారు. విశ్వసనీయత లేని టిటిడి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లాంటి వ్యక్తులకు పవన్ మద్దతు తెలపడం రాజకీయ కుట్రేనని ఆయన అన్నారు. ఎన్డీయే నుంచి తెదేపా బయటకి వచ్చిన తరువాతనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

తితిదే వేదికగా భాజపా, వైకాపా, జనసేన పార్టీ కుట్ర రాజకీయాలకు తెర తీశాయని, దీన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post