పాకిస్తాన్ నుంచి అహ్మదాబాద్ కు వలస వచ్చిన 90 మంది హిందువులకు జిల్లా అధికారులు భారతీయ పౌరసత్వాన్ని మంజూరు చేసారు. వీరికి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ విక్రాంత్ పాండే, భారత పౌరసత్వం చట్టం, 1955 యొక్క నిబంధనలకు అనుగుణంగా, భారతీయ పౌరసత్వం యొక్క సర్టిఫికేట్లు అందజేసారు.
2016 లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ యొక్క మైనారిటీ వర్గాలైన హిందువులు మరియు సిక్కులకు పౌరసత్వం జారీ చేసే ప్రక్రియను కేంద్రం వికేంద్రీకరించి, అహ్మదాబాద్, గాంధీ నగర్, కచ్ ప్రాంతాల కలెక్టర్లకు పౌరసత్వం జారీ చేసే అవకాశం కల్పించింది. అని పాండే ఈ సందర్భంగా విలేకరులతో అన్నారు.
Post a Comment