పవన్ కళ్యాణ్ గందరగోళంలో ఉన్నారా?

పవన్ కళ్యాణ్ గందరగోళంలో ఉన్నారా?
పవన్ కళ్యాణ్ లో ఓ ట్విట్టర్ వ్యాఖ్య లో 2014 ఎన్నికలలో తెలుగు ప్రజల సుస్థిరత కోసం సహకారం అందించాం , 2019 ఎన్నికలలో సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేయడానికి పోటీ చేయాలి. కానీ ఈ సమతుల్యత కోసం ఎన్నికలలో పోటీ చేయటం ఏంటి ? లేక అధికారం లోకి వస్తేనే అభివృద్ధిలో సమతుల్యత సాధ్యం అవుతుందని చెప్పదలచుకున్నారా? లేక ఆయనే గందరగోళం లో ఉండి మనల్ని గందరగోళ పరుస్తున్నారా?


2013 భూసేకరణచట్టం అమలు విషయంలో విశాఖపట్టణంలో ఒక వర్కుషాపు నిర్వహించనున్నట్లు పవన్‌ మరొక ట్వీట్లో తెలియచేసారు. ఇందులో మేధావులతో పాటు ఈ చట్టానికి సంబంధించిన భాగస్వామ్యులందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ చట్టం అమలు కాకపోవడం వల్ల సంభవిస్తున్న పరిణామాలపై చర్చ జరగనుందని పేర్కొన్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post