డాక్టర్ పరకాల ప్రభాకర్ తన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించారు. తక్షణం తన రాజీనామాను ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన గత నాలుగేళ్లుగా ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు దీనిని బిజెపి టీడీపీ ల కుమ్మక్కుగా చేస్తున్న ఆరోపణలతో మనస్తాపానికి గురై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Post a Comment