గత ఎనిమిది రోజులుగా లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇంట్లో నిరసన దీక్ష చేస్తున్న ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరి కాసేపట్లో దీక్ష విరమించి రాజ్ నివాస్ నుండి బయటకు వెళ్లనున్నారు. దీనితో ఢిల్లీలో ఏర్పడిన రాజకీయ ప్రతిష్ఠంభన ముగియనుంది.
లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేజ్రీవాల్ తో చర్చలు జరిపి, అతన్ని సెక్రటేరియట్ కి వెళ్లి ఐఏఎస్ అధికారులతో చర్చలు జరిపి వారితో ఉన్న వివాదాలు పరిష్కరించుకోమని సూచించటంతో ఈ వివాదం ముగిసింది. ఇప్పటికే వస్తున్న సమాచారం ప్రకారం ఐఏఎస్ అధికారులు ఇవాళ మంత్రులతో జరుగుతున్న సమావేశాలకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం కూడా అరవింద్ కేజ్రీవాల్, ప్రధాన మంత్రిని ఈ వివాదం పరిష్కరించమని కోరటం విశేషం.
Post a Comment