జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భద్రతా దళాలపై రాళ్లు విసిరే వారిని భవిష్యత్తులో మానవతా దృక్పథంతో వదిలివేసే అవకాశం లేదని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు శుక్రవారం చెప్పారు. మొదటి సారి రాళ్లు విసిరిన వారు అనే భావనే ఇక పైన ఉండబోదనీ, అలాంటి వారందరి పైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
2016 నవంబర్ 21 న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ మొదటి సారి నేరస్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని , రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ పథకం కింద 3,685 మంది విద్యార్థులకు, యువకులకు ఉపశమనం లభించింది. తప్పుదారి పట్టిన యువత కోసం ఒకసారి అవకాశం ఇచ్చామని, ఇకపై ఉపేక్షించబోమని వ్యాఖ్యానించారు.
ఒకటి కంటే ఎక్కువ సార్లు రాళ్లు విసిరిన నేరం కింద ఇప్పటివరకు 700 మందిపై క్రిమినల్ కేసులు పెట్టగా 40 మంది జైలులో ఉన్నారు.
Post a Comment