అమెరికా ఆస్టరాయిడ్స్ నుండి భూమిని రక్షించటానికి ప్రయత్నం చేయనుంది. ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొంటే కొన్ని ప్రాంతాల్ని, ఖండాల్ని లేక మొత్తం భూమి మీద జీవకోటిని కూడా తుడిచిపెట్టగలుగుతాయి.
ఇటీవలే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మెరుగైన ఉల్క గుర్తింపు, ట్రాకింగ్ మరియు పక్కదారి పట్టించే విధానాలను మెరుగు పరచటం కోసం కోసం పిలుపునిచ్చింది. దీనిలో అత్యవసర, సైనిక, వైట్ హౌస్ మరియు ఇతర అధికారులతో కలిసి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా పాలుపంచుకోనుంది.
నాసా లోని భూ సంరక్షణ విభాగ అధిపతి లిండ్లే జాన్సన్, 95% ఒక కిలోమీటర్ పరిమాణం గల వస్తువుల్ని భూమి సమీపంలో కనుగొన్నామని, వీటితో ఏ ప్రమాదం ఉండదని అన్నారు. కానీ మిగిలిన 5 శాతమే నష్టాన్ని కలిగించేవని అన్నారు. మొత్తం మీద ఇప్పటివరకు, అన్ని పరిమాణాలకు చెందిన 18,310 వస్తువుల జాబితా తయారు చేసామని తెలిపారు.
Post a Comment