పాక్ తాలిబన్ కు కొత్త అధినేత

పాక్ తాలిబన్ కు కొత్త అధినేత

పాకిస్తాన్ తాలిబన్ (తెహ్రీక్ -ఈ-తాలిబన్ -TTP ), తమ కొత్త అధినేతగా ముఫ్తి నూరా వాలి మెహసూద్ ను ఎన్నుకున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు పాత నాయకుడు మౌలానా ఫజూల్లా మరణాన్ని కూడా దృవీకరించారు. 2014 డిసెంబరులో పెషావర్ సైనిక పాఠశాలలో 100 కు పైగా పిల్లలతో సహా 150 మంది ప్రజల ఊచకోత వెనుక ఫజూల్లా మరియు టిటిపి హస్తం ఉంది. జూన్ 14న పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ యొక్క తూర్పు కునార్ ప్రావిన్స్ లో,  అమెరికా దళాలు  ఫజూల్లాను తమ డ్రోన్ దాడిలో మట్టుబెట్టాయి. 

శనివారం రోజు తెహ్రీక్ -ఈ-తాలిబన్  ప్రతినిధి మొహమ్మద్ ఖురాసనీ అమెరికా డ్రోన్ దాడిలో ఫజూల్లా మరణించారని నిర్థారించారు. ఇది మమ్మల్ని గందరగోళానికి గురి చేసింది. దేవుడిని నమ్మని వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు మా నాయకున్ని చంపేసారు. ఫజుల్లా కన్నా ముందున్న ఇద్దరు అధినేతలు కూడా డ్రోన్ దాడుల్లోనే చనిపోయారని కూడా ప్రస్తావించారు. అలాగే కొత్త నాయకుని ఎన్నికకు సంబంధించిన ప్రకటన కూడా చేసారు. 

పాకిస్తాన్ సైనికాధికారులు ఫజుల్లా మరణం తమకు అనుకూలమైన మార్పు అనీ, అతని మరణం పాఠశాల ఊచకోతతో సహా టిటిపి దాడులలో నష్టాలకు గురైన కుటుంబాలకు  ఉపశమనాన్ని కలిగించిందని వివరించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post