పవిత్రసంగమం వద్ద విద్యార్థుల గల్లంతు

పవిత్రసంగమం వద్ద విద్యార్థుల గల్లంతు

సరదాగా  విహారానికి వెళ్లిన నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన శనివారం రోజు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పవిత్రసంగమం వద్ద జరిగింది. ఇక్కడ గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేయటంతో ఈ ప్రాంతాన్ని పవిత్ర సంగమంగా పిలుస్తున్నారు. దీనిని దర్శించటానికి వచ్చిన విదార్థులలో ఇద్దరు  పర్యాటకులు వద్దంటున్నప్పటికీ, నదిలో దిగి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడటానికి  సహచర విద్యార్థుల్లో మరో ఇద్దరు దిగి వారు కూడా గల్లంతయ్యారు.  ఆ సమయంలో పట్టిసీమ నుంచి వచ్చే వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండి, దాదాపు 5600 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు అంచనా. 

గల్లంతయిన విద్యార్థులను ప్రవీణ్‌, చైతన్య, శ్రీనాథ్‌, రాజ్‌కుమార్‌ లుగా నిర్ధారించారు. వీరు కంచికచర్లలోని మిక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నదిలో రాత్రి వరకు గాలింపు కొనసాగించినప్పటికీ విద్యార్థుల ఆచూకీ లభించలేదు. ఈ రాత్రికి గాలింపును తాత్కాలికంగా ఆపివేసారు. గాలింపునకు వరద ప్రధాన అడ్డంకిగా మారుతోంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post