నేపాల్ టిబెట్ మధ్య రైల్వేలైన్


నేపాల్  ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ, బీజింగ్ పర్యటన సందర్భంగా చైనాతో సాంకేతిక పరిజ్ఞానం, రవాణా, మౌలిక సదుపాయాలు మరియు రాజకీయ సహకారం అంశాలపై 10 ద్వైపాక్షిక ఒప్పందాలు  కుదుర్చుకున్నారు.  వీటిలో టిబెట్ పశ్చిమ ప్రాంతాన్ని నేపాల్తో కలిపే రైల్వే లైన్ ముఖ్యమైనది. దీనిని చైనా నిర్మించనున్నట్లు చైనా డైలీ వెల్లడించింది. ఈ లైన్ టిబెటన్ నగరం జిగేజ్ (Xigaze) ను నేపాల్ రాజధాని ఖాట్మండు తో కలపనుంది. 

చైనా నేపాల్ తో కలసి రోడ్లు, విమానాలు, రైల్వేలు, మరియు టెలి కమ్యూనికేషన్ రంగాలతో క్రాస్ హిమాలయన్ కనెక్టివిటీ నెట్ వర్క్ ను  నిర్మించేందుకు ఆసక్తి చూపింది. 

నేపాల్ యొక్క ప్రథమ ప్రాధాన్యం క్రాస్ బోర్డర్ కనెక్టివిటీ అనీ, అలాగే జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కలిసి పని చేయాలని వ్యాఖ్యానించారు. 

పశ్చిమ నేపాల్ లో జల విద్యుత్ ప్లాంటు ను నిర్మించేందుకు, చైనా ప్రభుత్వ సంస్థ అయిన జిజ్ హౌబ (Gezhouba) తో కుదిరిన 2.5 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని నేపాల్ గతంలోనే రద్దు చేసింది. వెస్ట్ సెటి హైడ్రోపవర్ ప్లాంటును నిర్మించడానికి చైనా యొక్క త్రీ గోర్జెస్ ప్రాజెక్ట్ కార్పొరేషన్తో  1.6 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, కానీ ఆర్థికాంశాలలో ఒప్పందం కుదరకపోవడంతో ఇది కూడా సందేహంలో పడింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post