మాటల్లేవ్...

మొన్నటివరకూ మిత్రులుగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఇవాళ ఒకరికొకరు ఎదురుపడ్డారు. అయినా వాళ్లిద్దరూ మాట్లాడుకోకపోవటం విశేషం. 

దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ముందుగా సంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు తీసుకుని ఆలయంలోకి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 

గణపతి సచ్చిదానంద స్వామి వీరిద్దరితో పూజలు చేయించారు. ఆ సమయం లో ఇద్దరూ పక్క పక్కనే ఉన్నారు.  ఆలయంలో కొందరు మహిళలు చంద్ర బాబుతో మాట్లాడుతున్న సమయంలో పవన్ ఆయన పక్క నుంచే వెళ్లారు. అయినా ఒకరినొకరు పలకరించుకోలేదు.  

0/Post a Comment/Comments