థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ చేసిన సర్వేలో భారత్ ను మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా తేల్చింది. ఈ విషయంలో వీరు మన దేశాన్ని అంతర్యుద్ధం తో అట్టుడుకుతున్న సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ల కన్నా ప్రమాదకరమైనదిగా తేల్చారు. ఈ జాబితా లో టాప్ 10 లో ఉన్న ఏకైక పాశ్చాత్య దేశం అమెరికా కావడం గమనార్హం. అమెరికా ఉమ్మడిగా మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా మహిళలు లైంగిక హింస, వేధింపులు మరియు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు.
ఈ సర్వే దాదాపు 2011 లో జరిగిన సర్వే కు నకలు లాగానే ఉంది. అప్పుడు కూడా వీరు ఆఫ్ఘనిస్తాన్, కాంగో, పాకిస్తాన్, భారతదేశం మరియు సోమాలియా మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలుగా తేల్చారు.
అయితే ఈ సర్వే పై మన దేశ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ మన దేశానికి అపప్రథ తేవటానికే ఇలాంటి సర్వేల పేరుతో తమ ఉద్దేశాల్ని అంటగడుతున్నదనీ, కేవలం 550 మంది తో అంతర్జాతీయ నిపుణుల సర్వే ఏంటనీ మండిపడుతున్నారు.
జాతీయ మహిళల కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఈ సర్వే నివేదికను తిరస్కరించారు, భారత్ తర్వాత స్థానంలో ఉన్న దేశాల్లో కనీసం మహిళలు బహిరంగంగా మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇంత పెద్ద దేశ పరిస్థితిని కేవలం 500 మంది అభిప్రాయం తో అంచనా వేయలేము అని వ్యాఖ్యానించారు.

Post a Comment