కాంగ్రెస్ పార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కన్నా క్రూరుడిగా అభివర్ణించింది. దేశంలో గత 49 నెలలుగా ఆయన ప్రజాస్వామ్యాన్ని బానిసగా భావిస్తున్నాడని పేర్కొంది.
43 ఏళ్ల క్రితం విధించిన అత్యవసర పరిస్థితిపై మోడీ చేసిన దాడిపై కాంగ్రెస్ పార్టీ మీడియా ఛార్జి రణదీప్ సుర్జెవాలా మాట్లాడుతూ, 43 ఏళ్ల క్రితం 21 నెలల అత్యవసర పరిస్థితి విధించినట్లు బిజెపి మాట్లాడుతుంది, కానీ గత 49 నెలలుగా ప్రకటించని అత్యవసర పరిస్థితి అమలవుతుంది. అని అన్నారు.
గత 49 నెలల బిజెపి పాలనలోని వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రధాని అత్యవసర పరిస్థితిని వాడుకోవాలనుకుంటున్నారు. రైతులకు వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించటం, స్త్రీలపై నేరాలను తగ్గించటం, సమాజంలో మతపరమైన విభజన లాంటి దృష్టి పెట్టవలసిన అత్యవసర పరిస్థితులు ఇప్పుడు చాల ఉన్నాయి. ఇందిరా గాంధీ పైన నిందలు వేయటం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడదు అని సుర్జెవాలా చురకలంటించారు.
Post a Comment