జైలా ?.. మెట్రోనా ?... రెండూ కావాలి.

జైలా ?.. మెట్రోనా ?... రెండూ కావాలి.
ముంబైలో జైళ్లు ఖైదీలకు సరిపోకపోవటంతో  రాష్ట్ర ప్రభుత్వం కొత్త జైలుని నిర్మించాలని సంకల్పించింది. గత నవంబర్ లో నగరానికి తూర్పున ఉన్న మండలే, మనుకుర్ద్ ప్రాంతంలో రెండు హెక్టార్లకు పైచిలుకు స్థలం నూతన జైలు కోసం కేటాయించింది. దీనిని నగర జైళ్లలోనే పెద్దదిగా 1500-2000 మంది ఖైదీల సామర్థ్యంతో నిర్మించాలనుకున్నారు. 

అయితే 2015 లో జైలుకు కేటాయించిన స్థలానికి పక్కనే ఉన్న 22.23 హెక్టార్ల స్థలం ముంబై మెట్రో డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA), ఇప్పుడు తమకు ఆ స్థలం సరిపోదని, 30 హెక్టార్ల వరకు కేటాయించాలని కోరింది.  దీనితో జైలు నిర్మాణం అనుమానంలో పడింది. 

ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్ననిస్,  మంగళవారం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నే మెట్రో డిపో తో పాటు జైలును కూడా నిర్మించాలని అదనపు చీఫ్ సెక్రెటరీ (హోం) ని ఆదేశించారు. MMRDA రెండు ప్రాజెక్టులను అమలు చేస్తే, అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అని భావిస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post